మేధావులు, విద్యావంతులు తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో పాల్గొని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... నగరపాలక పురపాలక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాల కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత... రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వైకాపా విజయం కోసం కృషి చేయాలన్నారు.
'తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపాకే ఓటేయ్యండి' - తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల వార్తలు
తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు మద్దుతు పలకాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాల కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు.
'తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైకాపాకే ఓటేయ్యండి'