ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెదురుకుప్పంలో జల్లికట్టు హోరు - వెదురుకుప్పంలో జల్లికట్టు

సంక్రాంతి పండుగలో చివరి రోజైన ముక్కనుమ వేడుకలు వెదురుకుప్పంలో ఘనంగా జరిగాయి. వెదురుకుప్పం మండలం బ్రాహ్మణ పల్లెలో గ్రామస్థులు..పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా జల్లికట్టు నిర్వహించారు. పశువులను నియంత్రించేందుకు యువకులు పోటీ పడ్డారు.

jallikattu celebrations in chittoor district
వెదురుకుప్పంలో జల్లికట్టు హోరు

By

Published : Jan 16, 2021, 10:58 PM IST

వెదురుకుప్పంలో జల్లికట్టు హోరు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టు నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ... గ్రామస్థులు సంప్రదాయాలను గౌరవించండి అంటూ పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టు వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలను పూజించి, పశువులకు ప్రత్యేకంగా పూజలు జరిపారు.

పశువులను నియంత్రించేందుకు యువకులు ప్రయత్నించారు. పశువుల కిందపడి గాయాలపాలైనా లెక్కచేయకుండా సందడి చేశారు. వీక్షకుల పైకి పశువులు దూసుకెళ్లడంతో కొందరికి గాయాలయ్యాయి. జల్లికట్టు తిలకించడానికి ప్రజలు పోటెత్తారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి

మాంబేడులో ఘనంగా జల్లికట్టు పోటీలు

ABOUT THE AUTHOR

...view details