ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు - అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు తాజా వార్తలు

చిత్తూరు జిల్లా అనుప్పల్లిలో భోగి పండుగ కొత్త శోభను సంతరించుకుంది. కనుమ రోజు నిర్వహించాల్సిన పశువుల పండుగను గ్రామస్థులు ముందుగా నిర్వహించారు. యువకులు రెట్టించిన ఉత్సహంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

jallicattu celebrations at anupally
అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు

By

Published : Jan 13, 2021, 4:46 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు ప్రారంభయ్యాయి. ఉదయం పశువులను పూజించి వాటి కొమ్ములకు రంగులు అద్దారు. రాజకీయ, సినీ ప్రముఖుల, దేవుళ్ల చిత్రపటాలను వాటి కొమ్ములకు కట్టి రంగంలోకి దించారు. రోడ్డుకు ఇరు వైపులా నిల్చున్న యువకులు వాటిని నిలువరించేందుకు పోటీ పడ్డారు. పోటీలను తిలకించేందుకు రాష్ట్రం నలుముూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలిరావటంతో గ్రామం కిక్కిరిసిపోయింది.

అడ్డుకున్న పోలీసులు

వేడుకలను పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. సంప్రదాయ పండుగలను అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు.

అనుప్పల్లిలో జల్లికట్టు వేడుకలు

ఇదీచదవండి:భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం

ABOUT THE AUTHOR

...view details