కుప్పం కెనాల్‌కు హంద్రీనీవా జలాలు - JALAHARATHI
హంద్రీనీవా జలాలు కుప్పం కెనాల్‌కు చేరాయి. పెద్ద పంజాణి మండలంలో హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చారు.
కుప్పంకు చేరిన హంద్రీనీవా జలాలు
చిత్తూరు జిల్లా కుప్పం కెనాల్‌కు హంద్రీనీవా జలాలు చేరాయి. ఈ సందర్భంగా పెద్ద పంజాణి మండలంలో జల హారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి అమర్ నాథ్ రెడ్డి పాల్గొని జలహారతి ఇచ్చారు. గంగవరం, బైరెడ్డిపల్లి, శాంతిపురం, రామకుప్పం మీదుగా కుప్పం వరకు ఈ జలాలు ప్రవహించనున్నాయి. ప్రస్తుతానికి నీటిని నేరుగా కుప్పం వరకు ప్రవహింపజేసి, తరువాత చెరువులు నింపే కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు.