ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మునిగిపోయే చోట స్థలాలు ఇస్తే.. ఇళ్లు కట్టేదెలా! లబ్ధిదారుల ఆవేదన - jagananna colony lu jalamayam

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల నీట మునిగాయి. ఒంగోలు, తిరుపతి, కాకినాడ కనిగిరి ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం 'జగనన్న కాలనీ'ల కింద పేదలకు కేటాయించిన స్థలాలు చెరువుల్లా మారాయి. కాలనీల హద్దు రాళ్లూ కనిపించనంతగా మునిగిపోయాయి.

jagananna colony lu jalamayam
ఇక్కడ ఇళ్లు కట్టేదెలా!

By

Published : Jul 23, 2021, 9:00 AM IST

రాష్ట్రంలోని చాల ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నీటమునిగాయి. ఒంగోలు, తిరుపతి, కాకినాడ కనిగిరి ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పేరిట ఇళ్లు కట్టుకునేందుకు కేటాయించిన భూములన్ని నీళ్లతో నిండిపోయి..చెరువుల్లా తలపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో..

పాడిపేట-గాజులమండ్యం మార్గంలో సూరప్పకశం వద్ద జగనన్న కాలనీలో 1036 మంది లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఆ స్థలాలు అన్నీ నీట మునిగాయి. ఇలాంటి చోట ఈ సమయంలో ఇల్లు కట్టుకోవడమంటే ఆర్థిక భారమే తప్ప ఉపయోగం లేదని.. పెద్ద వర్షాలు కురిస్తే ఇళ్లన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

యు.కొత్తపల్లి మండలం కొమరగిరి, కాకినాడ గ్రామీణం నేమాంలో జగనన్న కాలనీ పేరిట పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్ని జలమయమయ్యాయి.

ప్రకాశం జిల్లాలో..

గిద్దలూరులో సగిలేరు వాగు ఒడ్డునే జగనన్న కాలనీ లేఅవుట్‌ వేశారు. ఇప్పుడు వాగు ప్రవహిస్తుండటంతో లబ్ధిదారులు స్థలాల వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఏటా వర్షాకాలంలో సగిలేరు పొంగుతుంది.. వాగుపై వంతెన నిర్మించకపోతే ఇళ్లు కట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ సమీపంలో ఉన్న స్థలాలు మునిగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే, తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అక్కడ వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

ఇది చదవండి:

Tokyo Olympics: ప్రారంభ వేడుకకు వేళాయెరా..

ABOUT THE AUTHOR

...view details