చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నికల హామీలను నెరవేర్చటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు జలాలను నియోజకవర్గానికి తరలిస్తామని మంత్రి హామీఇచ్చారు.
'రాష్ట్రాభివృద్ధికోసం జగన్ అహర్నిశలూ శ్రమిస్తున్నారు' - పెద్దిరెడ్డి తాజావార్తలు
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి