చిత్తూరు జిల్లా మదనపల్లెలో భరత్ అలియాస్ బన్నీ(12) ఇంట్లో తరచూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని బంధువులు తెలిపారు. భరత్ తల్లి సుమారు ఐదు సంవత్సరాల క్రితమే చనిపోవటంతో ఆదరించే వారు కరవు అయ్యారు
సెల్‌ఫోన్ దొంగిలించి అమ్మాడు..ప్రాణాలు పోగొట్టుకున్నాడు - మదనపల్లె వార్తలు
సెల్‌ఫోన్ ఒక బాలుడు ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీలో చోటు చేసుకుంది.
అయితే ఆ బాలుడు తన పెదనాన్న సురేష్ సెల్ ఫోన్ తస్కరించి ఓ వ్యక్తికి అమ్మాడని బంధువులు తెలిపారు. దీంతో భరత్‌ను గట్టిగా మందలించినట్లు తెలిపారు. బాలుడు సెల్ ఫోన్ విక్రయించిన చోటుకు తీసుకెళ్లి వారిని చూపించాడు. సెల్‌ఫోన్ కొన్న వ్యక్తి బాలుడిపై దాడి చేశాడని మృతుని పెదనాన్న చెప్పాడు. భరత్‌ను ఇంటికి తీసుకెళ్లగా.. ఉదయానికి చనిపోయాడని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిరామమందిర నిర్మాణానికి తిరుమలలోని నీరు, మట్టి సేకరణ