రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా పలమనేరు పరువు హత్య బాధిత కుంటుంబాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు. పలమనేరులోని ఉసరపెంట గ్రామంలో వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రుల చేతిలో వివాహిత హత్యకు గురైన సంగతి విధితమే. ఆమె భర్త కేశవులును జిల్లా ఎస్పీ వెంకటప్పనాయుడు, జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తా వేర్వేరుగా పరామర్శించారు. నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చూసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రమండలానికి మానవుడు ప్రయాణిస్తున్న ఈ కాలంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం మూర్ఖత్వమన్నారీ అధికారులు. బాధిత కుంటుంబాన్ని అన్ని విధలా ఆదుకుంటామన్నారు.
'ఈ కాలంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం మూర్ఖత్వం'
సంచలనం సృష్టించిన పలమనేరు పరువుహత్య బాధిత కుంటుంబాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ వేర్వేరుగా పరామర్శించారు. నిందితులకు శిక్ష పడేలా చూసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
బాధిత కుంటుంబానికి పరామర్శ