చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ఆలయానికి హెచ్‌వైఎం సంస్థ.. ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాలను అందజేసింది. వివిధ విభాగాల్లో పరిశీలించిన అనంతరం ఈ గుర్తింపునిచ్చింది. నాణ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల ఆరోగ్యం, ఆహారం, సమాచార భద్రత, విద్యుత్ నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పర్యవేక్షించారు. ఆలయ ఈవో పెద్దిరాజును సంస్థ ప్రతినిధులు కలిసి ఐఎస్ఓ పత్రాలు అందించారు.
శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు
చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరాలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. వివిధ విభాగాల్లో పర్యవేక్షించిన హెచ్‌వైఎం సంస్థ ధ్రువీకరణ పత్రాలను అందించింది.
ఐఎస్ఓ గుర్తింపు పత్రాలను అందిస్తున్న అధికారి