ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి నంబర్‌ లేకుండానే ఓట్లు, మృతులకూ జాబితాల్లో చోటు-న్యాయపోరాటం చేస్తామంటున్న విపక్షాలు - AP ఓటరు జాబితా 2023

Irregularities In Andhra Pradesh Voter List 2023: ఇంటి నెంబర్‌ లేకుండా ఓట్లు.. ఏళ్ల క్రితం చనిపోయిన వారికీ ఓటర్‌ జాబితాలో చోటు భార్య, భర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదు ఇవి చాలవన్నట్లు అధికార పార్టీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో ఓటరు జాబితా చిత్రాలు. ఓ వైపు విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా జాబితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగడం లేదు.

Irregularities_In_Andhra_Pradesh_Voter_List_2023
Irregularities_In_Andhra_Pradesh_Voter_List_2023

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 8:12 AM IST

Updated : Nov 22, 2023, 10:54 AM IST

ఇంటి నంబర్‌ లేకుండానే ఓట్లు, మృతులకూ జాబితాల్లో చోటు-న్యాయపోరాటం చేస్తామంటున్న విపక్షాలు

Irregularities In Andhra Pradesh Voter List 2023 :ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరిలో ఓటరు జాబితాలో అక్రమాలకు అంతులేకుండా పోతోంది.అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఓటరు జాబితాలో మార్పులు చేయాలన్న విపక్షాల వినతులు బుట్టదాఖలవుతున్నాయి. పోలింగ్ కేంద్ర స్థాయి ఏజంట్‌తో కలిసి క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓల పరిశీలనలో బయటపడిన లోపాలను సరిచేస్తున్న పరిస్థితులు లేవు. అధికారులు అనుసరిస్తున్న తీరుతో తప్పుల తడకగా మారిన ముసాయిదా ఓటర్ల జాబితానే చివరకు పూర్తి స్థాయి జాబితాగా వస్తుందన్న అనుమానాలు సర్వత్తా వ్యక్తమవుతున్నాయి.

Fake votes in Chandragiri at Chittoor District :జిల్లాలో మూడు లక్షల పైచిలుకు ఓట్లతో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరిలోఓటరు జాబితాలో అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. జీరో ఇంటి నెంబర్‌తో నమోదైన ఓట్ల వేల సంఖ్యలో ఉన్నాయి. సంవత్సరాల క్రితం చనిపోయిన వారి ఓట్లను జాబితాను తొలగించలేదు. ఓటర్ల నమోదు ప్రచార దినాల్లో చేపట్టిన పరిశీలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అధిక అక్రమాలు బయటపడ్డాయి. జాబితా నుంచీ మృతుల పేర్లు, ఇతర ప్రాంతా లకు నివాసం మారిన వారి పేర్లు తొలగించాలంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి సంబంధించిన దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి.

కొత్తపేటలో ఓట్లు తొలగించడానికి మరో ఎత్తుగడ - స్థానికంగా లేరంటా 4 వేల మందికి పైగా నోటీసులు

Irregularities in Chandragiri Voters List :చంద్రగిరి నియోజకవర్గంలో 395 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మూడు లక్షలా తొమ్మిది వందల నలభై ఓట్లుఉన్నాయి. గతంలో జరిగిన ఓటర్ల సర్వేలో మృతులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేరుతో దాదాపు పదిహేను వేల ఓట్లు ఉన్నట్లు గుర్తించిన విపక్ష పార్టీల బీఎల్‌ఏలు వాటిని తొలగించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. విపక్షాల వినతులు బుట్టదాఖలవగా తాజాగా విడదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అవే ఓట్లు పునరావృతం అయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రచార దినోత్సవాల పేరిట రెండు రోజుల పాటు పోలింగ్ కేంద్రాల స్థాయిలో హడావుడి చేయడం తప్ప ఎలాంటి మార్పులు చేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నకిలీ ఓటర్లు, డబుల్ ఎంట్రీల తొలగింపుపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినా ముసాయిదా జాబితాలో మార్పులు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మితిమీరుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - వైసీపీ సానుభూతిపరులకు రెండేసి ఓట్లు

AP Voter List 2023 :డబుల్‌ ఎంట్రీలు, జీరో డోర్‌ నెంబర్‌ ఓట్లు, పొరుగు నియోజకవర్గాల్లోని ఓట్లను చేర్చడం వంటి వాటిపై విపక్ష పార్టీల బీఎల్‌ఏలు మరో సారి అభ్యంతరాలు వ్యక్తం చేస్తు ఫారం-6, ఫారం-7 దరఖాస్తులు చేశారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోని పక్షంలో న్యాయపోరాటం తప్పదని స్పష్టం చేస్తున్నారు.

అధికార పార్టీ అయితే ఓటు హక్కు ఓకే - టీడీపీపై సానుభూతి ఉంటే ఇక అంతే!

Last Updated : Nov 22, 2023, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details