చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డీసీహెచ్ఎస్ సివిల్ సర్జన్ డాక్టర్ పాల్ రవికుమార్ విచారణ చేపట్టారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, కరోనా పరీక్షల అనంతరం పీపీఈ కిట్లను ఆస్పత్రి ఆవరణలోనే పడేయడం, ఇరవై రోజుల్లో కాలం చెల్లనున్న మందులను గర్భిణీలకు ఇవ్వడం లాంటి ఆరోపణలపై విచారణ జరిపారు.
నారావారిపల్లి పీహెచ్సీలో అధికారుల విచారణ - నారావారి పల్లి పీహెచ్‌సీపై వార్తలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని పీహెచ్సీలో డీసీహెచ్ఎస్ సివిల్ సర్జన్ డాక్టర్ పాల్ రవికుమార్ విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో ఆరోగ్య కేంద్రంపై వచ్చిన ఆరోపణలపై విచారించారు. ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బందితో సమావేశమై వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు

చుట్టుపక్కల ఉన్న 26 గ్రామాలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని..... తప్పులను సరిదిద్ది ఓపీలను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని డాక్టర్ కల్యాణ్ చక్రవర్తిని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న అంబులెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బందితో సమావేశమై వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తన నివేదికను రేపు ఉదయం ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందని విచారణ అధికారి డాక్టర్ పాల్ రవి కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: నరసారావుపేటలో జేఎన్టీయూ భవనాలకు సీఎం శంకుస్థాపన