కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచ దేశాలు చాలా ఆలస్యంగా గుర్తించాయని... ఫ్లూ, ఇన్ఫ్లూయెంజాల కన్నా అత్యంత వేగంతో కోవిడ్-19 మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తోందని ప్రముఖ యూరాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్. మధు తెలిపారు. ఒక పాజిటివ్ కేసు వ్యక్తి నుంచి నెలరోజుల్లో 900మందికి కరోనా వైరస్ సంక్రమిస్తోందని తెలిపారు. ప్రణాళిక లోపంతోనే కరోనా వైరస్ ఐరోపా, అమెరికా దేశాలను కుదిపేస్తోందన్నారు. యాంటీబాడీస్పై జరుగుతున్న పరిశోధనలు కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. శరీరంలో ప్లాస్మాను బలోపేతం చేస్తేనే కరోనాను ఎదుర్కోగలమని వివరించారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచటం, ఐసోలేట్ చేయటం చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ నష్టపోయినా... కూలీలు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని ఆయన అన్నారు.