కర్ణాటకలో జరిగిన 20 చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగ అఫ్సర్ను చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పలమనేరు డీఎస్పీ గంగయ్య వివరాలు వెల్లడించారు. అఫ్సర్.. ఇటీవల కాలంలో పుంగనూరులో పలు చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ. 5 లక్షల 30వేల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం - Interstate thief arrest at punganur
పలు చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగ అఫ్సర్ను చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల 30వేల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య వెల్లడించారు.
చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
'పుంగనూరు దొంగతనాల్లో లభించిన ఆనవాళ్ల ఆధారంగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించాం. కర్ణాటకలో 20 చోరీ కేసుల్లో.. అఫ్సర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలింది. నిందితుడి నుంచి రూ. 5 లక్షల 30వేల విలువగల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నాం' అని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి..:రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ.. నగదు, వెండి, బంగారం అపహరణ