ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ ఫక్కీలో అంతర్జాతీయ స్మగ్లర్​ అరెస్టు - latest news in sri city

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివశంకర్, అతని ఇద్దరు అనుచరులను శ్రీసిటీ పోలీసులు అరెస్టు చేశారు. రాచకండ్రిగ వద్ద జరిపిన వాహనల తనిఖీల్లో పట్టుబడిని వీరిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న స్మగ్లర్లు

By

Published : Nov 1, 2019, 8:33 AM IST

తిరుపతికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివశంకర్ శ్రీ సిటీ పోలీసులకు చిక్కాడు. తమిళనాడు సరిహద్దుల వద్ద శ్రీ సిటీ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో శివశంకర్, అతని ఇద్దరు అనుచరులు తిరుమల్‌రెడ్డి, సిరాజ్ బాషా తెల్లవారు జామున 4.30 సమయంలో దొరికిపోయారు. శివశంకర్ అతని అనుచరులతో కలిసి స్కార్పియోలో వెళ్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. చెన్నైవైపుగా అనుమానాస్పదంగా వెళ్తున్న స్కార్పియోను పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా డ్రైవర్​ ఆపలేదు. వెంటనే అధికారులు ఆ వాహనాన్ని వెంబడించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే శివశంకర్​పై 64 పెండింగ్ కేసులు ఉన్నాయనీ, అతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details