అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. రూ.2 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం - Red sanders smuggler Arrested in chittoor
16:49 March 26
Red sanders smuggler Arrested: రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గిరినాయుడు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో బడా స్మగ్లర్ గిరినాయుడు అరెస్టు అయ్యాడు. సత్యవేడు మండలం దాసుకుప్పం సచివాలయం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా.. ఒక జీపు, లారీలో ఎర్రచందనం దుంగలను గుర్తించారు. రూ.2 కోట్ల విలువైన 4 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. గిరినాయుడు అనుచరులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి లారీ, జీపు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గిరినాయుడు ఎర్రచందనం దుంగలను ఇతర దేశాలకు తరలించేవాడని.. అతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి:ప్లాస్టిక్ వ్యర్థాలతో.. విద్యార్థుల చేతులు అద్భుతాలు చేశాయి!