ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.. - Drugs uses in young people news

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువత మాదక ద్రవ్యాల కారణంగా మానసిక రోగులుగా మిగిలిపోతున్నారని సీఐ రామచంద్రా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన అనంతరం యువకులకు మాస్కులను పంపిణీ చేశారు.

International Anti-Drugs Day
యువతకు అవగాహన సదస్సు

By

Published : Jun 26, 2020, 6:33 PM IST

మాదక ద్రవ్యాలకు కట్టు బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని సీఐ రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్​స్టేషన్ ఆవరణలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌, గంజాయి, కొకేన్‌ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయని, ఎంతో మంది జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చెడు వ్యసనాలకు బానిసైతే వారి కుటుంబాలు చిన్నా భిన్నం కాక తప్పదని చంద్రగిరి సీఐ.రామచంద్రా రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు చిన్న రెడ్డప్ప, రామకృష్ణ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details