ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరువు హత్య కారకులకు శిక్ష తప్పదు' - INTERCASTE-MARRIAGE-LEADS-TO-SUSPICIOUS-DEATH-OF-NEWLY-WEDS-MINOR GIRL IN-CHITTOR

చిత్తూరు జిల్లా శాంతిపురంలో కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువు సొంతింటిలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు పరువుహత్య అనే కోణంలో కేసు నమోదు చేసి...దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాలిక స్వగ్రామం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు

బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం:చిత్తూరు జిల్లా కలెక్టర్

By

Published : Oct 14, 2019, 9:51 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురంలో మండలం రెడ్లపల్లిలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. వద్దుమడిలో దళిత కుటుంబానికి చెందిన నందకుమార్ అనే యువకున్ని రెడ్లపల్లికి చెందిన బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. బాలిక చనిపోవటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెడ్లపల్లిలో మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు శాంతిపురంలో నిరసన వ్యక్తం చేశారు

నవ వధువు మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం:చిత్తూరు జిల్లా కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details