చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైకాపా నేతలు ధ్వంసం చేసిన మామిడి తోటను తెదేపా ఎమ్మెల్సీ రాజ నరసింహులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, నియోజకవర్గ బాద్యులు హరికృష్ణ, జనసేన బాధ్యులు యుగంధర్ పొన్న వేర్వేరుగా పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును రైతుల నుంచి తెలుసుకున్నారు.
కేవలం తెదేపా సానుభూతి పరులు అన్న కారణంగా వైకాపా నేతలు దాడి చేయడం హేయకరమైన చర్య అని ఎమ్మెల్సీ మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నేతలు బాధిత రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఈ విషయమై జిల్లా పోలీసు యంత్రాంగంతో చర్చించి బాధిత రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా తెదేపా పోరాడుతుందని స్పష్టం చేశారు.