ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి సమీపంలో బయటపడ్డ పురాతన శాసనం - తిరుమల తిరుపతి వార్తలు

తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళమాత ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పురాతన శాసనం బయటపడింది. ఇది చోళుల కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.

Peruru near Tirupati,
Peruru near Tirupati,

By

Published : Aug 5, 2020, 2:58 PM IST

తిరుమల శ్రీవారి తల్లిగా పూజలు అందుకునే వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం ఒకటి బయట పడింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళమాత ఆలయ అభివృద్ధి పనుల్లో ఈ పురాతన శాసనం వెలుగు చూసింది. ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా గుర్తించారు.

పురాతన శాసనం

ఈ శాసనం ఆధారంగా ఇక్కడే విష్ణుమూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. తితిదేలో వకుళమాత ఆలయానికి సంబంధించి..గతంలో శాసన ఆధారాలు దొరకని పక్షంలో... ఈ శాసనంపై పురావస్తు శాఖ అధికారులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details