అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం ఉపాధిహామి క్షేత్ర సహాయకుడు చిన్న రాసుపై అధికారులు విచారణ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాం నుంచి అవినీతికి పాల్పడుతూ... ఉపాధి కూలీలను వేధిస్తున్నాడంటూ.. ఇటీవల సంబంధిత గ్రామాల కూలీలు మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట పెట్రోల్ సీసాలతో నిరసన చేశారు. దీనిపై స్పందించిన ఏపీడీ కిరణ్ కుమార్ రెడ్డి క్షేత్రసహాయకుడిపై విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏపీడీ వెల్లడించారు.
ఉపాధిహామి క్షేత్ర సహాయకుడిపై విచారణ - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా వెంగళరాజుకుప్పం ఉపాధిహామి క్షేత్ర సహాయకుడిని అధికారులు విచారించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏపీడీ వెల్లడించారు.
ఉపాధిహామి క్షేత్ర సహాయకుడిపై విచారణ