తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడి చేయి చూపుడు వేలికి సిరా గుర్తు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇటీవల వరుసగా జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలికి సిరా గుర్తు వేశారు. ఆ ఎన్నికల్లో ఓటేసిన వారే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారి ఎడమ చేయి వేలికి ఇంకా సిరా ఉండటంతో.. ఉప ఎన్నికల్లో కుడి చేయి వేలికి వేయాలని నిర్ణయించినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేతికి సిరా - నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజావార్తలు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడి చేయి చూపుడు వేలికి సిరా గుర్తు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. సీఈసీ నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేతికి సిరా