ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటల తరబడి బస్టాండ్​లోనే మృతదేహం - chandragiri bustand inhuman incident news

మానవత్వం మంటగలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. సహాయం చేయాలన్న ఎవరూ ముందుకు రాని దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా చంద్రగిరి ఆర్టీసీ బస్​స్టాండ్​లో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా భయంతో స్థానికులు పట్టించుకోక పోవడంతో మృతదేహం గంటల కొద్దీ అలాగే పడి ఉంది.

man died
గంటల తరబడి బస్టాండ్​లోనే మృతదేహం

By

Published : May 2, 2021, 11:22 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో అమానుష సంఘటన జరిగింది. తిరుపతి జీవకోనకు చెందిన బ్రహ్మయ్య పది రోజుల క్రితం అనారోగ్యంతో మల్లయ్యపల్లెలోని బంధువులు ఇంటికి వచ్చాడు. అయితే కరోనా భయంతో బంధువులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బ్రహ్మయ్య చంద్రగిరి ఆర్టీసీ బస్​స్టాండ్​లో తలదాచుకుంటున్నాడు. ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మయ్య మృతి చెందాడు. ఆదివారం కావడంతో బస్టాండ్ పక్కనే సంత జరుగుతోంది. రద్దీ ఉన్న ప్రాంతంలో మృతదేహం ఉన్నా కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. గంటలు కొద్దీ మృతదేహం అక్కడే ఉన్నా కనీసం పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. మృతుడుకి కరోనా సోకిందనే భయంతో స్థానికులు అటువైపే రావటం లేదు.

ABOUT THE AUTHOR

...view details