ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిగ్గింగ్ జరగకుండా చూడండి.. ఎస్సై కాళ్ళపై పడిన అభ్యర్ధి - చిత్తూరు జిల్లా మున్నిపల్ ఎన్నికల పోలింగ్​లో ఎస్సై కాళ్ళపై పడి అభ్యర్ధి వార్తలు

చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఎదుట స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ ఆందోళనకి దిగారు. ఎస్సై కాళ్ళపై పడి ప్రాధేయపడ్డారు. రిగ్గింగ్ జరగకుండా న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు మోకరిల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

independent candidates request
న్యాయం చేయాలంటూ ఎస్సై కాళ్ళపై పడి అభ్యర్ధి అభ్యర్ధన

By

Published : Mar 10, 2021, 2:13 PM IST

చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తనకు న్యాయం చేయాలంటూ ఓ అభ్యర్థి పోలీసులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ అభ్యర్ధించారు. నగరంలోని 29వ డివిజన్ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఎదుట స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ ఆందోళనకి దిగారు. అధికార పార్టీ అభ్యర్థి దౌర్జన్యం చేస్తూ.. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్.. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై సుమన్ కాళ్ళపై పడి ప్రాధేయపడ్డారు. రిగ్గింగ్ జరగకుండా న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు మోకరిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 29వ డివిజన్ కి స్వతంత్ర అభ్యర్థులుగా.. శ్రీనివాస్ అతని భార్య వనిత ఇద్దరు బరిలో ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details