చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..తిరుపతి నగరంలో మరో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. నిర్ధేశిత సమయాల్లో తప్ప..ప్రజలు మిగిలిన సమయాల్లో బయట తిరగరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాలని కోరుతూ...ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతి పట్టణంలో జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి పోలీస్ వాహనాల కవాతు నిర్వహించారు.
చిత్తూరులో పెరుగుతున్న కరోనా కేసులు..లాక్డౌన్ నిబంధనలు కఠినతరం - చిత్తూరులో కరోనా కేసులు
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తూ..పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
![చిత్తూరులో పెరుగుతున్న కరోనా కేసులు..లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చిత్తూరులో పెరుగుతున్న కరోనా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6932449-653-6932449-1587792081690.jpg)
చిత్తూరులో పెరుగుతున్న కరోనా కేసులు
Last Updated : Apr 25, 2020, 4:18 PM IST