తిరుమలలో ఎడితెరిపిలేని వర్షం... భక్తులకు అవస్థలు - undefined
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిరంతరాయంగా వర్షం కురుస్తున్నప్పటికీ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ సరైన సౌకర్యాలు లేకపోవటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తిరుమలలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎడితెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఘటాటోపం నీడలో గరుడవాహన సేవ కొనసాగుతోంది. స్వామివారి గరుడ వాహనం పశ్చిమ మాడ వీధిలోకి ప్రవేశించగానే వర్షం ప్రారంభమైంది. తడుస్తూనే వాహనసేవను భక్తులు దర్శించుకుంటున్నారు. గొడుగులు, పట్టల సాయంతో మాఢవీధుల్లో వారు వేచి ఉన్నారు. వర్షం పడుతుండటం, చాలినన్ని బస్సులు లేకపోవటంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన అద్దె వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రూ.70 ఛార్జీ ఉంటే రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. ఎడితెరిపిలేని వర్షం కారణంగా శ్రీవారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరిగారు.