చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలో మతిస్థిమితం లేని వ్యక్తికి దుస్తులు, భోజనంపెట్టి సేవాభావాన్నిచాటుకున్నారు హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్. ఈయన రోడ్డుపై పర్యవేక్షణలో ఉండగా మతిస్థిమితం లేని వ్యక్తి శరీరంపై వస్త్రాలు లేకుండా తిరగటాన్ని గమనించారు. అసలే కరోనా కాలం కావడంతో మతిస్థిమితం లేని వ్యక్తికి ఈ వస్త్రాలను తొడిగేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆయన స్వయంగా దుస్తులు తొడిగారు. అనంతరం భోజనం అందిచారు. కానిస్టేబుల్ పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'మతిస్థిమితం లేని వ్యక్తికి దుస్తులు, భోజనం అందజేసిన కానిస్టేబుల్'
శరీరంపై వస్త్రాలు లేకుండా తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి వస్త్రాలు, భోజనం పెట్టి పోలీస్ అధికారి సేవాభావాన్నిచాటుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. ఖాకీలు కొట్టడమే కాదు దాతృత్వాన్ని కూడా చాటుకుంటారు అనటానికి ఈ ఘటనే నిదర్శనం...
'మతిస్థిమితం లేని వ్యక్తికి బట్టలు,భోజనం అందజేసిన కానిస్టేబుల్ '
TAGGED:
srikalahasthi latest news