పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాల త్రిసభ్య కమిటీకి పాత పాలకవర్గానికి పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గాన్ని నియమించారు. ఈ మేరకు మదనపల్లె సహకార డివిజన్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పీలేరు మండల సింగిల్ విండో చైర్మన్‌గా బీడీ నారాయణరెడ్డి, కలికిరికి రెడ్డివారి వెంకట్ రెడ్డి, వాల్మీకిపురం రామకృష్ణారెడ్డి, గుర్రంకొండ వెంకటశివారెడ్డి, కలకడ కమలాకర్ రెడ్డి, కేవీపల్లి మండలానికి శివశంకర్‌రెడ్డి సింగిల్ విండో చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
వ్యవసాయ సహకార సంఘాలకు నూతన ఛైర్మన్లు - సహకార సభ్యల
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలక వర్గాలను నియమించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొత్త సభ్యులను ఎన్నుకున్నారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకవర్గం సభ్యులు