చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్ట వద్ద కొందరు అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక బీపీ అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి రాజకీయ పలుకుబడితో ఈ తవ్వకాలు జరిపిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. అటువైపు నిల్వ చేరే మురుగునీటిని నదిలో కలిపేందుకు పైపులైన్లు ఏర్పాటుకు సొంతంగా పనులు ప్రారంభించాడు. వరదల సమయంలో నదీ ప్రవాహం ఉద్రిక్తంగా మారినా పట్టణంలోని నివాసాల్లోకి నీరు రాకుండా ఉండేందుకు కరకట్టను నిర్మించారు. ఈ పరిస్థితుల్లో అధికారులకు సమాచారం లేకుండా కరకట తవ్వేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన పనులపై జలవనరుల శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పురపాలక సంఘం అధికారులతో కలిసి అక్కడికి చేరుకొని.. తవ్వకాలు చేపట్టిన వ్యక్తిని మందలించారు. తిరిగి పూడిపించారు. కరకట్ట తవ్వకం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.
స్వర్ణముఖి నది కరకట్ట తవ్వకం.. - Illegal excavations at Swarnamukhi river embankment in Srikalahasti
శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది కరకట్ట వద్ద కొందరు అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ అండదండలతో ఈ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు.

స్వర్ణముఖి నది కరకట్ట తవ్వకం