కడప జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని.. చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి రెండు లారీల్లో.. వెయ్యి బస్తాల బియ్యాన్ని బెంగళూరుకు తరలిస్తుండగా.. మదనపల్లి టూ టౌన్ పోలీసులు పట్టణ శివారు ప్రాంతం వద్ద కాపు కాసి పట్టుకున్నారు.
బియ్యం బస్తాలకు సివిల్ సప్లై పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు మదనపల్లి డీఎస్పి మనోహర్ ఆచారి తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.