చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం మోడల్ కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన... 179 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా సరుకు తరలించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు తెలిపారు.
పీలేరుకు చెందిన చికెన్ దుకాణం నిర్వాహకుడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి కలిసి కర్ణాటక రాష్ట్రం నుంచి రూ.1.79 లక్షలు విలువచేసే 179 లీటర్ల మద్యాన్ని అక్రమంగా తెచ్చి ఇంట్లో ఉంచారు. సమాచారం అందుకున్న పీలేరు ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.