కర్ఫ్యూ కారణంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గల ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సరిహద్దు వద్ద ఉన్న మంగాడు చెక్‌పోస్టు వద్ద..రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 221 మద్యం బాటిళ్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని నగరి సీఐ మదయ్యచారి తెలిపారు.
రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా మద్యం తరలింపు..పట్టివేత - అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మద్యం పట్టివేత
లాక్డౌన్, ఇతర కారణాలతో తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యం తరలిస్తుండగా... తాజాగా చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు మద్యం తరలించడం సంచలనం రేకెత్తించింది. తమిళనాడులో లాక్డౌన్ నేపథ్యంలో కొందరు డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో మన రాష్ట్రం నుంచి అక్కడకు మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.
రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత.. నలుగురు అరెస్ట్