చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని చిన్న తంగల్ గ్రామం వద్ద తమిళనాడు నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 45 కోటర్ బాటిల్స్, ఐదు ఫుల్ బాటిల్ అక్రమ మద్యాన్ని, రెండు స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఆంధ్రలో ఎక్కువ ధరలకు అమ్మడానికి తీసుకొని వెళ్తున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడు ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు. ఇతనిపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం రిమాండ్కు తరలిస్తామని నగరి సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత - Andhra-Tamil Nadu border latest news update
తమిళనాడు నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి అక్రమ మద్యంతోపాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత
ఇవీ చూడండి...
ఆగస్టు నెల... శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
TAGGED:
అక్రమ మద్యం తాజా వార్తలు