చిత్తూరు జిల్లా గంగవరం మండలం పసుపత్తూరులో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసుపత్తూరు వద్ద పలమనేరు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 672 టెట్రా ప్యాకెట్ల మద్యం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - చిత్తూరు జిల్లా క్రైం
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. సరిహద్దు రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పసుపత్తూరులో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 672 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
![కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత illegal karnataka wine seize at pasuvatthooru chitthore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8197616-883-8197616-1595876385080.jpg)
కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత