టపాసుల అక్రమ నిల్వలపై పోలీసుల దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం పట్టణంలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. పలు నివాస గృహల్లో అక్రమంగా టపాకాయల నిల్వ ఉన్నట్లు.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు దాడులు చేశామని వెల్లడించారు.
టపాసుల నిల్వలపై పోలీసుల ఆకస్మిక దాడులు! - నాగలాపురంలో అక్రమ టపాసుల స్వాధీనం
చిత్తూరు జిల్లా నాగలాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి అందిన రహస్య సమాచారం మేరకు.. దాడులు చేశామని ఎస్సై నరేష్ వివరించారు. దొరికిన సరకు విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు