చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో అక్రమ ఇళ్ల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అధికారులు ధ్రువీకరించకుండా, పట్టాలు పంపిణీ చేయకుండానే గ్రామస్థులు ఇళ్లు కట్టుకోవటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసేదాకా ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని గతంలోనే అధికారులు నోటీసులు జారీచేసిన లబ్ధిదారులు పట్టించుకోలేదని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదు ఇళ్లను జేసీబీతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
అక్రమ ఇళ్ల నిర్మాణాల కూల్చివేత - illegal construction of houses in chittoor dst
అధికారులు ధ్రువీకరించకుండా పట్టాలు పంపిణీ చేయకుండా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నిండ్రమండలం కొప్పేడు గ్రామంలో జరిగింది.
illegal construction of chittoor dst nindra mandal koppedu village