చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్తలకు, నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటానని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పాకాలలో తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డితో కలిసి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైకాపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేసిందన్నారు. నవరత్నాల హామీల అమలును... కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పారదర్శకంగా చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
''కుల మతాలకు అతీతంగా నవరత్నాల అమలు'' - YCP
గత ప్రభుత్వం వైకాపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులపాలు చేసిందని చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
![''కుల మతాలకు అతీతంగా నవరత్నాల అమలు''](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3836806-750-3836806-1563114110642.jpg)
ఆత్మీయ సమావేశం