ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయలవారికోటలో అసాంఘిక కార్యకలాపాలు.. - Rayalavarikota in chandra giri

చారిత్రక కట్టడం చంద్రగిరి రాయలవారికోట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆ ప్రాంతంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు కోట సిబ్బందిపై దాడికి దిగారు. ఈ రోజు ఉదయం వారు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రాయలవారికోట
రాయలవారికోట

By

Published : Jul 22, 2021, 3:40 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని చారిత్రక కట్టడం రాయలవారి కోట ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. జన్మదిన వేడుకల కోసం ఇక్కడకు వస్తున్న యువకులు మద్యం తీసుకువచ్చి అక్కడే తాగి ఆ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తున్నారని సిబ్బంది చెప్తున్నారు.

సిబ్బందిపై దాడి..

మద్యం మత్తులో ఉన్న యువకులు కోట సిబ్బందిపై దాడికి దిగారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గాయాలవడంతో వారు.. నేడు చంద్రగిరి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువకులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ మ్యూజియం సీనియర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. దాడి చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details