ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశంలోనే తిరుపతి ఐఐటీ అత్త్యుత్తమం: కేంద్ర మంత్రి పోఖ్రియాల్ - chitor, iit tirupati

చిత్తూరు జిల్లాలోని ఐఐటీ తిరుపతిలో తొలి స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 104మంది విద్యార్థులకు పట్టాలు అందచేశారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

By

Published : Aug 14, 2019, 10:28 AM IST

Updated : Aug 14, 2019, 10:41 AM IST

తిరుపతి ఐఐటీలో తొలిదశలో నిర్మించిన శాశ్వత భవనాలను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పది జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని... ఆంధ్రప్రదేశ్​లో జరిగినంత అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన కొనియాడారు. పనులు పూర్తి చేసి బిల్లులు పెడితే....నిధులను అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. 2015 తర్వాత దేశంలో ఏర్పాటైన ఆరు ఐఐటీలలో తిరుపతి అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేవిధంగా కృషి చేస్తోందని వివరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 104 మంది విద్యార్థులకు పతకాలు అందచేశారు.

Last Updated : Aug 14, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details