చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కంచుతో తయారు చేసిన మూడు అడుగుల విష్ణుమూర్తి, శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని దుండగులు విగ్రహాలను అపహరించి.. చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్ సమక్షంలో వివరాలను నమోదు చేసి ట్రెజరీకి తరలిస్తామని చెప్పారు. ఈ ఘటనపై పురావస్తుశాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.
చేపల చెరువులో దేవతామూర్తుల విగ్రహాలు.. రంగంలోకి పురావస్తు అధికారులు
చేపల చెరువులో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడిన ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం పరిధిలో జరిగింది. చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం అందించారు.
idols of god found in fish pond
Last Updated : Aug 21, 2021, 7:26 AM IST