ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యకు కరోనా... మనస్థాపంతో భర్త ఆత్మహత్య - chithore district latest news

భార్యకు కరోనా సోకడాన్ని తట్టుకోలేని భర్త మనస్థాపానికి గురై పురుగులమందు తాగాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా వీసీ వడ్డిపల్లెలో జరిగింది.

husband suicide with mental tension in vcvaddipall
మనస్తాపంతో భర్త ఆత్మహత్య

By

Published : May 8, 2021, 3:26 PM IST

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వీసీ వడ్డిపల్లెకు చెందిన కృష్ణంరాజు అలియాస్ చిన్నరాజుకు భార్య , ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడు రోజుల క్రితం చిన్నరాజు భార్యకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. చికిత్స నిమిత్తం ఆమెను తిరుపతిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

తన భార్యకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనన్న అనుమానంతో చిన్నరాజు తీవ్ర మనస్తాపానికి గురై పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దామల్​చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details