చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలంలో భార్యపై అనుమానంతో శంకరప్ప అనే వ్యక్తి.. తన భార్యను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం నారాయణమ్మ అనే మహిళ ఆరుబయట నిద్రిస్తుండగా ఆమె భర్త శంకరప్ప ఒంటి గంట సమయంలో రోకలితో తలపై గట్టిగా కొట్టి చంపినట్లు విచారణలో తేలింది.
వారం క్రితం కూడా భార్య పై కత్తితో దాడి చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని మెులకలచెరువు సీఐ సురేశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు.