శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లికి చెందిన రామయ్య(60) గురువారం గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. అయితే భర్త కోసం మధ్యాహ్నం భార్య లాలియమ్మ(50) భోజనం తీసుకుని వెళ్లింది. సాయంత్రం వరకూ ఇంటికి రాలేదు. సాయంత్రం గొర్రెలు తోలుకుని రామయ్య ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో లాలియమ్మ ఏది అంటూ తల్లి గురించి పిల్లలు ప్రశ్నించారు. మధ్యాహ్నమే వచ్చేసిందని రామయ్య బదులిచ్చాడు. తల్లిని ఏదో చేసి ఉంటావని తండ్రిని పిల్లలు నిలదీశారు. భయపడిన రామయ్య గ్రామంలోని తాగునీటి ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీకాళహస్తి గ్రామీణ సీఐ కృష్ణ మోహన్ తెలిపారు. భార్యను చంపిన విషయం బయటకు తెలుస్తుందని భయంతోనే భర్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
భార్యను చంపిన భర్త.. భయంతో ఆ తర్వాత ఆత్మహత్య! - భార్యను చంపిన భర్త వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లిలో భార్యాభర్తల మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను శ్రీకాళహస్తి గ్రామీణ సీఐ కృష్ణ మోహన్ వెల్లడించారు.
భార్యను చంపిన భర్త.. భయంతో ఆ తర్వాత ఆత్మహత్య!