అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు లేపింది.. చిత్తూరు జిల్లా, రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామంలో అనుమానంతో భార్యను బండరాయితో కొట్టి హతమార్చాడు భర్త. వడమాలపేట మండలానికి చెందిన అమ్ములు, భాస్కర్ దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం రామచంద్రాపురం మండలంలోని పారకాల్వ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కోళ్ల ఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రేమ్ కుమార్, పవన్ కుమార్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే.. గత మూడు నెలలుగా భార్యపై అనుమానంతో భర్త భాస్కర్ తరచూ గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అమ్ములు గొంతు పిసికి, బండరాయితో తలపై కొట్టి భాస్కర్ పరారయ్యాడు.
చిచ్చు రేపిన అనుమానం.. భార్యను హత్య చేసిన భర్త - husband kill wife at chittor
భార్య మీద తనకున్న అనుమానమే పెనుభూతమైంది. అది కాస్త అర్ధాంగినే అంతమొందించే స్థాయికి చేరింది. భార్యనే బండరాయితో కొట్టి మట్టుబెట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో జరిగింది.
![చిచ్చు రేపిన అనుమానం.. భార్యను హత్య చేసిన భర్త kill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13647023-210-13647023-1637046048703.jpg)
kill
స్థానికులు ఉదయం గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, పారిపోయిన భాస్కర్ కోసం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: