భార్య మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసి, కనిపించకుండా పోయిన వ్యక్తి ఉదంతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో వెలుగుచూసింది. ఆసుపత్రి అధికారుల తెలిపిన ప్రకారం.. తిరుపతి నగరం జీవకోనకు చెందిన నగేష్ భార్య మనీషా (30) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. కామెర్లతో బాధపడుతోందంటూ నగేష్ మంగళవారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న మనీషా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పిన నగేష్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రిలో అతను రాసిన నంబరుకు ఫోన్ చేశారు. అది తిరుపతిలో నగేష్ పక్కింట్లో నివాసముంటున్న ఓ మహిళదిగా గుర్తించి.. ఆమె ద్వారా ప్రాథమిక వివరాలు సేకరించారు. మనీషా తిరుమలలో నల్లదారాలు విక్రయించగా, నగేష్ టీ దుకాణంలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. నగేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని శవాగారానికి తరలించారు.
ఆసుపత్రిలో భార్య మృతదేహం... డబ్బులు తీసుకువస్తానని అదృశ్యమైన భర్త! - శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి వార్తలు
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చాడా భర్త. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు... ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకువస్తానని.. భార్య మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి.. భర్త అదృశ్యమయ్యాడు.
భార్య మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసిన భర్త