చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్... అతని భార్యతో కలిసి బెంగళూరులో నివసించేవాడు. వీరికి కరోనా సోకిన కారణంగా.. కుప్పం వచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.
అనంతరం బెంగళూరు వెళ్లేందుకు కుప్పం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ప్లాట్‌ఫాంపై రైలు కోసం నిరీక్షిస్తుండగా... చంద్రశేఖర్ మళ్లీ అస్వస్థతకు గురై భార్య ఒడిలో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టింది.