ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య ప్రాణాలు తీసి.. అటుపై ఆత్మహత్యాయత్నం - husband murder his wife latest news update

అనుమానం పెనుభూతంగా మారి ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వీకోట మండలం పముగానిపల్లెలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కర్కశంగా కొడవలితో నరికి చంపాడు. అనంతరం తనూ గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. మద్యం మత్తులో భార్యతో గొడవ పడి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Husband commits suicide after murder his wife
భార్య ప్రాణాలు తీసి భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 27, 2020, 1:37 PM IST

చిత్తూరు జిల్లా వీకోడ మండలం పముగానిపల్లెలో భర్త భార్యను దారుణంగా కొడవలితో నరికి చంపాడు. అనంతరం తను ఆత్మహత్యకు యత్నించాడు. పముగానిపల్లెకి చెందిన మద్యానికి బానిసైన ప్రభాకర రెడ్డి కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. అనుమానంతో తరుచు గొడవ పడే అతను.. భార్యతో ఘర్షణకు దిగి.. ఆ కోపంలో భార్య రేణుకను కొడవలితో నరికి చంపాడు. అనంతరం తను ఆత్మహత్యకు యత్నించాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచిన రేణుక మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details