ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో ఉద్యోగం మానేయ్యలేదని భార్యపై భర్త దాడి - crime news in chittoor district

అనుమానం పెనుభూతం అని మరోసారి రుజువైంది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సి భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఉద్యోగానికి వెళ్లొద్దంటూ వేధించాడు. తన మాట వినకుండా విధులకు హాజరైనందుకు దాడి చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రంలో జరిగింది.

ఆసుపత్రిలో ఉద్యోగం మానేయ్యాలేదని భార్యపై భర్త దాడి
ఆసుపత్రిలో ఉద్యోగం మానేయ్యాలేదని భార్యపై భర్త దాడి

By

Published : Apr 30, 2020, 11:59 PM IST

ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై భర్త అనుమానంతో దాడి చేసిన ఘటన తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన త్రివేణి, శరణ్‌లు భార్యభర్తలు. త్రివేణి తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సపోర్ట్‌ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శరణ్‌ అనుమానంతో విధులకు హాజరుకావొద్దంటూ రోజూ భార్యను వేధించేవాడు. తన మాటలు వినకుండా విధులకు హాజరైందని త్రివేణిపై శరణ్‌ దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న త్రివేణి సోదరుడు శ్రీనివాసులు ఆమెను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి సిఫార్సు‌ చేశారు. ఈ ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి సీఐ సురేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:భార్యపై కత్తితో దాడి చేసి.. భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details