చిత్తూరు జిల్లాలో కత్తితో భార్య గొంతు కోసి.. భర్త ఆత్మహత్యాయత్నం - husband attack on wife in Chittoor district latest news
08:54 December 07
కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గెడ్డకిందపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని వెంకటేష్ రెడ్డి, శిరీషాలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. కలహాలు ఎక్కువడంతో దగ్గరలోని మామిడితోపులో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తితో భార్య గొంతు కోసి ఆమె భర్త వెంకటేష్ రెడ్డి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. భార్య శిరీష మృతి చెందగా.. భర్త వెంకటేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు... ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
కృష్ణాజిల్లా బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి