చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెం సమీపంలో స్వర్ణముఖి నదిలో.. నిన్న దంపతులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. భర్త నాగరాజు మృతదేహం గుర్తించారు. ప్రమాదం జరిగిన వంతెన నుంచి సుమారు కిలోమీటరు దూరంలో నాగరాజు మృతదేహం లభ్యమైంది. అతని భార్య సుబ్బలక్ష్మి ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
స్వర్ణముఖి నదిలో గల్లంతైన నాగరాజు మృతదేహం లభ్యం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
స్వర్ణముఖి నదిలో నిన్న దంపతులు గల్లంతైన ఘటనలో.. నాగరాజు అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతని భార్య ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
husband-and-wife-drown-