ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేటగాళ్ల ఉచ్చులో చిక్కి దుప్పి మృతి - శేషాచలం అడవుల్లో వేటాడుతున్న వేటగాళ్లు

చిత్తూరు జిల్లా చంద్రగిరి శేషాచలం అడవులలో వేటగాళ్లు మాటు వేసి వన్య ప్రాణులు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. వేటగాడి ఉచ్చుకు చిక్కుకుని ఓ దుప్పి ప్రాణాలు వదిలింది.

hunters killing animals at seshachalam forest
ఉచ్చులో చిక్కుకుని మరణించిన దుప్పి

By

Published : May 22, 2020, 7:59 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి శేషాచలం అడవులలో వేటగాళ్ల వలలో చిక్కి వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. వేసవి కాలం రావడంతో శేషాచలం అడవుల నుంచి దాహం తీర్చుకోవడానికి జన సంచారంలోకి రావడంతో అదే అదునుగా వేటగాళ్లు మాటువేసి హత మారుస్తున్నారు. ఓ వేటగాడు వేసిన ఇనుప కమ్ముల ఉచ్చుకి చిక్కుకుని దుప్పి మృతి చెందింది. అజ్ఞాత వ్యక్తి సమాచారంతో డీఎఫ్ఓ నాగార్జున రెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మిట్టపాలెం ఎస్సీ కాలనీకి చెందిన రాఘవులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన చుక్కల దుప్పికి తిరుపతి పశువుల ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. కళేబరాన్ని పాతి పెట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వన్య ప్రాణులను హింసించినా, వేటాడినా, ఉచ్చులు వేసి వాటి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details